పల్లెకెలె:శ్రీలంకలోనే
సెప్టెంబరులో జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి, పరిస్థితులను
అర్థం చేసుకోవడానికి భారత జట్టుకు ఇది ఆఖరి అవకాశం. ఐదు వన్డేల సిరీస్‌ను
విజయవంతంగా ముగించిన ధోనిసేన పర్యటనలో ఆఖరి మ్యాచ్, ఏకైక టి20లో మంగళవారం
శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక చేయడానికి ముందు భారత్ ఆడే
చివరి టి20 కూడా ఇదే. కాబట్టి జట్టులో స్థానం ఆశిస్తున్న కుర్రాళ్లందరూ
సత్తా నిరూపించుకోవడానికి ఇది ఆఖరి అవకాశం.
వీరూ, జహీర్ అవుట్: గాయం కారణంగా ఆఖరి వన్డేకు దూరమైన సెహ్వాగ్‌తో పాటు
జహీర్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదు. ఇద్దరూ గాయాల కారణంగా
స్వదేశానికి వచ్చారు. ఫామ్ పరంగా భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగానే
కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రైనా, ధోని, గంభీర్ జోరుమీదున్నారు.
ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌తో పాటు స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో కీలకం. అటు
శ్రీలంక జట్టుకు సంగక్కర సేవలు అందుబాటులో లేవు. జయవర్ధనే, దిల్షాన్,
మాథ్యూస్, పెరీరా కీలక ఆటగాళ్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి