ఉత్తమ విశాఖ
విశాఖపట్నం(విశాల విశాఖ ) దేశంలోని 63 ప్రధాన నగరాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం అమలవుతోంది. రాష్ట్రంలో విశాఖతోపాటు హైదరాబాద్, విజయవాడ నగరాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా నగర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధుల్ని సమకూర్చుతాయి. మిగిలిన 30 శాతం నిధుల్ని స్థానిక సంస్థలే వెచ్చించాలి. దీంతోపాటు స్థానిక సంస్థల స్వయం సమృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించే సంస్కరణలను తప్పనిసరిగా అమలు చేయాలి. అలా చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులు అందుతాయి. సంస్కరణల అమల్లో మిగిలిన నగరాలతో పోల్చుకుంటే జీవీఎంసీ ముందంజలో ఉంది.భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారిత ఆస్తి పన్ను మదింపు, ఘన వ్యర్థ నిర్వహణ తప్ప మిగిలిన సంస్కరణలు నగరంలో అమలవుతున్నాయి. ఈ రెండింటినీ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జీవీఎంసీ యంత్రాంగం కృషి చేస్తోంది. యూఐజీలో మనమే ముందంజగత ఏడాది పట్టణ పేదలకు మౌలికవసతుల (బీఎస్‌యూపీ) కల్పనలోనగరం ముందంజలో నిలిచి ప్రధానినుంచి జాతీయ పురస్కారాన్ని అందుకుంది. దీంతోపాటు పట్టణ మంత్రిత్వశాఖ నుంచి కూడా అవార్డు దక్కింది.బి.శ్రీధర్ కమిషనర్‌గా ఉండి అందుకున్న చివరి పురస్కారం ఇదే. ఈఅవార్డు అందుకున్న తర్వాతే ఆయనవుడా ఉపాధ్యక్షునిగా బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో వి.ఎన్.విష్ణు కమిషనర్‌గా జీవీఎంసీ బాధ్యతలు చేపట్టారు. విష్ణు హయాంలో జీవీఎంసీఈసారి పట్టణ మౌలిక వనరులు,పాలన(యూఐజీ)లో అగ్రస్థానంలోనిలిచి ఉత్తమ నగరంగా ఎంపికయింది.63 మిషన్ నగరాల్లో ।నెహ్రూ* సంస్కరణల అమలు, పూర్తి ఆధారంగా ఈఅవార్డును ప్రకటించారు. పట్టణస్థాయిలో అక్కౌంట్, ఈ గవర్నెన్స్,జీఐఎస్ ఆధారిత ఆస్తి పన్ను, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థ నిర్వహణ, పట్టణపేదలకు మౌలిక వసతుల కల్పన,పరిపాలన, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య ప్రోత్సాహం, నిర్మాణాత్మకంతదితర 11 సంస్కరణలపై కేంద్రంఅధ్యయనం చేసింది. గత ఏడాదిదక్కిన పురస్కారం కంటే ప్రస్తుత అవార్డుతో నగరానికి ఉత్తమ ఘనత దక్కినట్టే. ఈ అవార్డు కింద జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం జ్ఞాపికతో పాటు, రూ. 2 లక్షలనగదు బహుమతిని కూడా అందించనున్నారు.