ఆ ఆలయ గోపురం ఏడు అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు. ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం. ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచబడిన 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పును కలిగిన నంది విగ్రహం రెండువేల సంవత్సరాల ఆ ప్రాచీనమైన ఆలయం పేరు శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం.ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైంది. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు.18 శక్తి పీఠాల్లో నాలుగోది అయిన శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.
ఎలా వెళ్లాలంటే..?
కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన మహానగరాలలో ఒకటైన మైసూరు పట్టణానికి సుమారు పది కిలో మీటర్ల దూరంలో శక్తి పీఠం ఉంది. ఈ శక్తి పీఠం సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులోనున్న చాముండీ పర్వతంపై నెలకొని ఉందిమైసూరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. కాలినడకన సుమారు ఐదు కి.మీ ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కొండ ఎక్కాలంటే.. వెయ్యి మెట్లున్నాయి. ఈ దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.
ఆలయ చరిత్ర:
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఉడైయార్ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.
ప్రచారంలో ఉన్న పురాణ కథ:
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై ఒక స్త్రీశక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుందిముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం భయంకరంగా కనిపిస్తుందిమహిషాసురుని వధించిన ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.