తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై బనాయించిన కేసులను ఎత్తివేతలో కొన్ని ప్రమాణాలు పాటించాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఉద్యమాల్లో పాల్గొన్ని విద్యార్థులపై నమోదు చేసిన కేసుల్లో చిన్న చిన్న కేసులను ఎత్తివేయాలన్నారు.ఆస్తుల ధ్వంసాలు, దగ్ధం చేయడాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం, దాడులు చేయడాలు వంటి పెద్ద పెద్ద వాటిపై కేసులు ఎత్తివేయాల్సిన అవసరం లేదని ఆయన ఆయన ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అలా చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు తమ నిరసన తెలిపాయి. జేపీ ప్రసంగించే సమయంలో వారు నినాదాలు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి