తూర్పుగోదావరి జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన బుధవారం ప్రారంభంమైంది. ఈ యాత్ర కోసం మంగళవారం రాత్రి ఆయన సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రైలులో బయలుదేరారు. రాజమండ్రి స్టేషన్‌లో స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించి, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తారు.
రాజమండ్రి చేరుకోనున్న వైఎస్ జగన్, రోడ్ షో పూర్తిచేసుకుని కాకినాడ చేరుకుంటారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట జరిగే వివాహ కార్యక్రమంలో జగన్‌తో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇదిలావుండగా, బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి