ఏషియన్ క్రీడోత్సవాలకు ఆహ్వానం
విశాఖపట్నం : ఈ నెల 12 నుంచి 27 వరకు చైనాలో నిర్వహించే 16వ ఏషియన్ క్రీడోత్సవాలకు భారత్ తరఫున నగర మేయర్ పి.జనార్దనరావు, కమిషనర్ వీఎన్ విష్ణు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఐఐఎల్‌ఎస్‌జీ) నుంచి ఆహ్వానం అందింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి కోసం జీవీఎంసీ లేఖ రాసింది. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. చైనాలోని గంజవుహూలో ఏషియన్ క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఈ ఉత్సవాలకు చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా నగర మేయర్, కమిషనర్‌ను భారత్ తరఫున ఆహ్వానించారు. వీరి పర్యటన ఖర్చు మొత్తాన్ని చైనా ప్రభుత్వమే భరించనుంది. వీరిద్దరికీ ఇప్పటికే పాస్ పోర్టులు ఉండటంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి రావడమే తరువాయని జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి