21, నవంబర్ 2010, ఆదివారం
విజయవాడ నగర పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం
విజయవాడ: విజయవాడ నగర పోలీస్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి రోశయ్య ఈ ఉదయం ప్రారంభించారు. vijayawadapolice.org పేరిట ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. కమిషనరేట్‌కు చెందిన 15 విభాగాలతో అన్ని వివరాలను ఈ సైట్‌లో పొందుపరిచారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్సై పరీక్ష నిర్వహించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఏఐవైఎఫ్ నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి పుట్టపర్తికి వెళ్లేందుకు బయల్దేరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి