హైదరాబాద్: విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఎస్‌బీహెచ్ ఎండీ రేణుచల్లూ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారసంస్థ డిప్యుటీ డైరక్టర్ జనరల్ భాస్కర్‌లు సంతకాలు చేశారు. అనంతరం నమోదు ప్రక్రియపై యూఐడీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్యాంకు అధికారులకు వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి