18, నవంబర్ 2010, గురువారం
మరోసారి తార్నాక వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఎస్సై రాతపరీక్షల రద్దు కోసం మళ్లీ ఉస్మానియా విద్యార్థులు రోడ్డెక్కారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తార్నాక వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. హబ్సీగూడ వద్ద వ్యాపారసముదాయాలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలసులు విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగించారు. తార్నాక నుంచి క్యాంపస్ వైపు వెళ్లే దారులను, అడిక్‌మెట్ ఫైఓవర్‌ను పోలీసులు మూసివేయడంతో రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో 8 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్‌తో పోలీసులు భారీగా మోహరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి