25, నవంబర్ 2010, గురువారం
లారెన్స్ అభ్యర్థనను తిరస్కరించిన అనుష్క
కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చేసుకున్న అభ్యర్థనను సెక్సీతార అనుష్క తిరస్కరించిందట. ఇంతకీ ఆ అభ్యర్థను ఏంటని అనుకుంటున్నారా...? మరేం లేదండీ... అనుష్కకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రెండు భాషల్లోనూ కాంచన అనే సినిమా తీయాలని లారెన్స్ ప్లాన్ చేశాడు.రెండు భాషా చిత్రాల్లోనూ హీరోయిన్‌గా అనుష్కను నటింపజేసేందుకు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడట. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ తమిళ వెర్షన్‌లో నటించనని అనుష్క తెగేసి చెప్పిందట.దీంతో ప్రస్తుతం తమిళ భాషలో మరో హీరోయిన్‌ను నటింపజేసేందుకు వెతికే పనిలో ఉన్నాడట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి