కాంబోడియాలోని నామ్‌ఫెన్‌లో జరుగుతున్న జలోత్సవంలో సోమవారం రాత్రి తొక్కిసలాట జరిగి 345మందికి పైగా మృతిచెందారు. మృతుల్లో 240మంది మహిళలు ఉన్నారు. 329మందికి తీవ్రగాయాలయ్యాయి. బ్రిడ్జిపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు లక్షల మంది ప్రజలు ప్రయత్నించడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జనం కాళ్ల కింద నలిగి, నీళ్లల్లో పడిపోయి అనేక మంది మృతిచెందారు. మృతులసంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి