* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

21, నవంబర్ 2010, ఆదివారం

సోనియాపై సాక్షి కథనం: జగన్‌కు షోకాజ్ నోటీసులు!?

చెప్పిన మాట వినడని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్‌పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. సాక్షి టీవీ ఛానెల్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై కాంగ్రెస్ అధిష్టానం తగిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో జగన్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న హైకమాండ్, ఆ కథనం పార్టీ పరువుకు భంగం కలిగించేవిగా ఉంటే ఏమి చర్య తీసుకోవాలని యోచిస్తోంది.కానీ జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. పనిలో పనిగా సాక్షి కథనంపై నివేదిక పంపాల్సిందిగా పీసీసీకి హైకమాండ్ ఆదేశించింది. అధిష్టానం ఆదేశంతో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే నివేదిక పంపారు. కాగా.. హైకమాండ్ నివేదికను పరిశీలించి.. జగన్‌కు షోకాజ్ నోటీసు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రాంతీయ పార్టీకి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. సోనియాపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆందోళనకు దిగారు. అయితే ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు సురేష్ బాబు అరెస్టు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాక్షి పత్రికలను తగులబెడుతూ.. సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి