27, నవంబర్ 2010, శనివారం
ధారూర్ ఠాణాలో లాకప్ డెత్!
వికారాబాద్: హత్య కేసులో నాలుగు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న వ్యక్తి స్టేషన్‌లోనే విగతజీవుడయ్యాడు. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నా.. పరిస్థితులు మాత్రం లాకప్‌డెత్ జరిగిందన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఈ నెల 22న ధారూర్ మండల కేంద్రంలో పోగుల అనంతయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు 23న పత్తి కిష్టయ్య(45)ను అదుపులోకి తీసుకొన్నారు. నాలుగు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచి విచారణ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి కిష్టయ్యను హఠాత్తుగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించగా కాపాడి ఆసుపత్రికి తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. కిష్టయ్యను పరీక్షించిన వైద్యులు ఎప్పుడో చనిపోయాడని తేల్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. కిష్టయ్య ఒంటిపై దెబ్బలు కనిపిస్తుండటం, ఉరేసుకున్నాడన్న కథనం వినిపిస్తూనే కుటుంబీకులతో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని చెప్పించేందుకు పోలీసులు ప్రయత్నించడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి