తెదేపా నేత దారుణ హత్య
మాడుగుల(విశాల విశాఖ): రావికమతం మండలం మేడివాడ మేజరు పంచాయతీ మాజీ సర్పంచి, తెదేపా సీనియర్ నాయకుడు గొర్లె గణేష్ రామకృష్ణ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడు. ప్రత్యర్థులు ఇతన్ని హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తుండగా పోలీసులు కకూడా ఈ దశగానే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద పరిస్థితులు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. గణేష్ రామకృష్ణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి పనిమీద బమటకు వచ్చారు. రెండు రోజులైనా అతను తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు రావికమతం పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు ఆదృశ్యం అయినట్లుగా కేసు నమోదు చేయడం పాఠకులకు తెలిసిందే. ఈ లోగా మంగళవారం సాయంత్రం పిట్టగెడ్డ వీధిలో చందనాల కొండ తుప్పల్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించి గ్రామస్థులు చెప్పడంతో వీఆర్వో ఎర్రయ్య మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది.
భూ తగాదాలే కారణమా..?
గణేష్‌ను కుట్రతో, పథకం ప్రకారమే ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో గొల్లవిల్లి సోమునాయుడు (తాతబాబు) కుటుంబంతో గణేష్‌కు భూవివాదం తలెత్తింది. కేసు కోర్టులో నడుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఉదయం గణేష్ వద్దకు వచ్చి భూ సమస్య పరిష్కారానికని చెప్పి మాడుగుల వైపు తీసుకెళ్లాడని హతుడు సోదరుడు గొర్లె సత్యనారాయణ (బాబులు) తెలిపారు. అప్పటి నుంచి తిరిగి రాలేదన్నారు. ప్రత్యర్థులే హత్య చేయించి అక్కడ పడేసి ఉంటారని, గొల్లవిల్లి తాతబాబు తదితర ముగ్గురు వ్యక్తులపై సంఘటనాస్థలి వద్దే లిఖితపూర్వక ఫిర్యాదుచేశాడని మాడుగుల ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కాగా గాజువాకకు చెందిన కిషోర్ అనే యువకుడు ఓ భూ వివాదం తరచూ ఇతని వద్దకు వచ్చేవాడని, ఆదివారం కూడా ఇతడు వచ్చాడని కుటుంబీకులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి