21, నవంబర్ 2010, ఆదివారం
ఆసుపత్రిలో చేరిన హృతిక్
ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. హృతిక్ తీసుకున్న రోగ నిరోధక (యాంటిబయాటిక్) మందులు వికటించి ఎలర్జీకి గురవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇక్కడి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ''హృతిక్ నటించిన 'గుజారిష్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆయన తీరికలేకుండా ఉన్నారు. ఆదివారం ప్రచార కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన వేసుకొన్న మందులు వికటించాయి'' అని హృతిక్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ''యాంటిబయాటిక్ వల్ల నేను ఎలర్జీకి గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొంతు మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోయాను'' అని హృతిక్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ''ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. రాత్రికి ఇంటికి వెళ్లిపోవచ్చు'' అని చెప్పారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి