దాదాపు గత రెండేళ్లుగా దేశాన్ని పీడించిన ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కున్న అనంతరం భారత్ అతి వేగంగా కోలుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ అగ్ర దేశాల కన్న వేగంగా రెండెకల వృద్ధి వైపు శరవేగంగా పయనిస్తోంది.ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ అబివృద్ధిలో భారతీయలు అభిప్రాయాలపై నిర్వహించిన ఓ సర్వేలో 2010 సంవత్సరంలో స్థానిక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని భావించే వారి సంఖ్య గడచిన మూడేళ్లుగా చూస్తే గణనీయంగా పెరిగింది.గత 2007, 2009 మధ్య కాలంలో స్థానిక ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని విశ్వసించే వారి సంఖ్య 52 శాతం నుంచి 37 శాతానికి పడిపోయింది. కానీ.. 2010లో మాత్రం ఆ సంఖ్య తిరిగి వృద్ధి చెందుతూ.. 45 శాతానికి పెరిగినట్లు సర్వే నిర్వహించిన "గల్లుప్" తెలిపింది.ఇదే విధంగా భారతీయుల జీవణ ప్రణాల మీద కూడా గల్లుప్ సర్వే నిర్వహించింది. జీవణ ప్రణాలపై ఈ ఏడాది భారతీయులపై జరిపిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు తమ జీవణ ప్రణాల మెరుగుపడినట్లు వెల్లడించారు. కాగా.. గతేడాది వీరి సంఖ్య 32 శాతంగా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి