బెంగుళూరు(పిటిఐ): భారత్ సుదీర్ఘ సముద్ర కోస్తా తీరంలో అత్యంతాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలో 20 కిమీ దూరంలో ఏ పడవ కదలికలైనా ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షించవచ్చని కోస్తాలో ఎక్కడ ఏది ఉందో కనిపెట్టవచ్చని ఇక్కడ అధికారులు చెప్పారు. ఈ వ్యవస్థలో ఒక రాడార్, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సర్, కమాండ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ ఉంటాయన్నారు. దేశం మొత్తం కోస్తా తీరంలో ప్రతి చదరపుటంగుళం మేర నిఘా పెట్టవచ్చన్నారు. కంటితో చూడవచ్చని భారత్ ఎలక్ట్రానిక్స్ బెంగుళూరు,డైరెక్టర్ ఐ.వి.శర్మ చెప్పారు. రక్షణరంగానికి చెందిన ఈ కంపెనీ తీరరక్షకదళం కోసం ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. 46 సున్నితమైన ప్రాంతాలలో మూడు చోట్ల ఈ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తారని వచ్చే ఏడాదికి ఇది పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమకోస్తాపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి