ఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి పదవి నూటికి నూరు పాళ్లు తెలంగాణకు చెందిన వ్యక్తేకే దక్కుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో అధిష్ఠానంతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వర్గం కూర్పు రేపు పూర్తవుతుందని, అయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అధినాయకత్వం సూచనమేరకు మంత్రి వర్గంలో అన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారికి సమ ప్రాధాన్యం ఇచ్చామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జగన్ విషయమై మాట్లాడుతూ.. జగన్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడని, అందరు సభ్యులను చూసినట్లే ఆయన్ని చూస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది తాను కాదని, ఆ విషయంలో పూర్తి అధికారం అధిష్ఠానందేనని స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి