ఇరాన్ దేశంలో కుటుంబ నియంత్రణ వల్ల జనభా సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో అక్కడ బాల్యవివాహాలను ఆ దేశాధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నారు. 16 ఏళ్లు నిండిన బాలికలు పెళ్లి చేసుకోవచ్చని ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మది నెజాది సూచించారు.గడచిన 1979లో ఇస్లామిక్ విప్లవం వెలుగుచూసిన నేపథ్యంలో 1990లో జననాల సంఖ్యను తగ్గించేందుకు అప్పటి ఇరాన్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణను అమలు చేసింది. కానీ.. అక్కడ నాటకీయ పరిణామాలతో జనన సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.ఆ సమయంలో దీనిని వ్యతిరేకించిన వారే ఎక్కువగా ఉన్నారు. కుటుంబ నియంత్రణ ప్రక్రియ దైవ వ్యతిరేకమని, పాశ్చాత్య సంస్కృతి నుంచి దిగుమతయిందని అధ్యక్షుడు విమర్శలు చేశారు. కాబట్టి బాలురకు 20ఏళ్లు, బాలికలకు 16ఏళ్లు రాగానే వివాహాం చేసుకోవాలని కోరుతున్నట్లు నెజాది చెప్పారు.కాగా.. ప్రస్తుతం ఇరాన్‌లో బాలురకు 26, బాలికలకు 24 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలనే నిబంధన ఉంది. గత 2005లో నెజాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ జనాభా పెరగాలని కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే దేశంలో ఓ వైపు నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఈ తాజా పరిణామాల వల్ల జనాభా మరింత పెరిగితే.. నిరుద్యోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశముందని విమర్శకుల వాదన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి