దివంతగ ముఖ్యమంత్రి సతీమణి, వై.ఎస్. విజయమ్మ ఉప ఎన్నికల్లో పులివెందుల శాసనసభా నియోజక వర్గం నుంచ పోటీ చేస్తారని వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రకటించారు. పులివెందులకు విజయమ్మ, కడప లోక్‌సభ స్థానానికి వై.ఎస్. జగన్ రాజీనామా చేయడం ద్వారా ఆ రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, తన పార్టీని 45 రోజుల్లో ప్రకటిస్తానని వై.ఎస్. జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా, మంగళవారం సాయంత్రం లింగాల మండలం కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి తన తల్లి విజయమ్మ పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని రెచ్చగొట్టి, పదవి ఆశ చూపి తమ కుటుంబాన్ని కాంగ్రెసు అధిష్టానం చీల్చిందని ఆయన ఆరోపించారు.మరోవైపు వై.ఎస్. జగన్ వ్యూహం మారిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. పులివెందుల స్థానం నుంచి తాను పోటీ చేసి, కడప పార్లమెంటు సీటు నుంచి తన సోదరి షర్మిళను పోటీకి దించాలని మొదట జగన్ అనుకున్నారు. అయితే, చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.పులివెందులలో తాను పోటీ చేస్తే కాంగ్రెసు అధిష్టానం తనపై చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించే అవకాశం ఉండటంతో అందుకు వివేకానంద రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయవచ్చును. ఈ కారణంతోనే వైయస్ విజయమ్మ పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి ముందుకు రారనే అభిప్రాయంతో విజయమ్మను ఉప ఎన్నికల బరిలోకి దించనున్నట్లు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి