26, డిసెంబర్ 2010, ఆదివారం
భవానీ దీక్షా విరమణకు ఏర్పాట్లు పూర్తి
విజయవాడ( విశాల విశాఖ ప్రత్యేక ప్రతినిది): భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భవానీలు దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. రేపు జరగబోయే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ ఈవో విజయకుమార్ తెలిపారు. ప్రసాదాల విషయంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి నాలుగేసి లడ్డూలు చొప్పున ఇస్తామన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి