25, డిసెంబర్ 2010, శనివారం
విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి
వరంగల్: జిల్లాలోని మరిపెడ మండలం వీరారం గ్రామంలో ఈ ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఎంబీబీఎస్ చదువుతున్న తిలక్, బీటెక్ చదువుతున్న భరత్ క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చారు. తోటకు నీళ్లు పెట్టేందుకు ఈ ఉదయం పొలానికి వెళ్లారు. ఆ సమయంలో తిలక్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతడిని రక్షించేందుకు యత్నించిన భరత్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుదాఘాతంతో వీరిద్దరూ సమీపంలోని బావిలోకి పడిపోయారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి