14, డిసెంబర్ 2010, మంగళవారం
భర్తను హత్య చేసిన భార్య
నల్గొండ: భర్తను హత్య చేసి కుటుంబ సభ్యుల సాయంతో బావిలో పడేసిన సంఘటన దోనబండ తండాలో జరిగింది. ఈ నెల 1వ తేదీన జరిగిన ఈ సంఘటన మృతుని తమ్ముని ఫిర్యాదుతో వెలుగు చూసింది. తండాకు చెందిన బానోతు బాలు(30)కు భార్యతో గొడవలున్నాయి. ఈనేపధ్యంలో రెండువారాల క్రితం బాలును ఆమె హత్య చేసి తండాకు దూరంగా ఉన్న పాడుపడిన బావిలో పడేసింది. ఈమెకు ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ పిల్లాడు దీన్ని చూశాడు. వచ్చీరాని మాటలతో విషయాన్ని పలువురికి చెప్పాడు. అనుమానం వచ్చిన బాలు తమ్ముడు కోటి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు వారాలుగా తన తమ్ముడు కనిపించడం లేదని అందులో పేర్కొన్నాడు. పోలీసులు ఈరోజు భార్యను ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. ఆమె బావిని చూపించింది. హుజురాబాద్ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి