25, డిసెంబర్ 2010, శనివారం
పాక్‌లో ఆత్మాహుతిదాడి: 40 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్‌లో జరిగిన ఓ ఆత్మాహుతిదాడిలో 40 మంది మృతి చెందగా 72 మందికి గాయాలయ్యాయి. బజౌర్ ప్రాంతంలోని ఖర్ పట్టణంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఇక్కడ ప్రపంచ ఆహారసంస్థ ఆహార పంపిణీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది దీంతో అక్కడ ఆహారాన్ని తీసుకునేందుకు 1000 మంది వరకు వచ్చారు. ఆ సమయంలో ఈ బాంబుదాడి జరిగింది. పాకిస్థాన్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణంలో తరచు ఆల్‌ఖైదా దాడులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి