పౌర హక్కుల ఉద్యమ నేత కెజి కన్నబిరాన్ కన్నుమూత
హైదరాబాద్: పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రముఖ న్యాయవాది కెజి కన్నబిరాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. సికింద్రాబాదులోని మారేడుపల్లిలో గల ఆయన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1994లో ఆయన పియుసిఎల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దివంగత బాలగోపాల్ తో కలిసి ఆయన పౌర హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.ఆయన భార్య వసంతా కన్నబిరాన్, కూతురు కల్పనా కన్నబిరాన్ సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నారు. కన్నబిరాన్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆయనకు నక్సలైట్ సానుభూతిపరుడిగా పేరుంది. నక్సలైట్లకు చెందిన పలు కేసులను ఆయన చేపట్టారు. అయితే, ఎటువైపు నుంచి తప్పు జరిగినా ఆయన నిర్భయంగా ప్రశ్నించారు. ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి