కృష్ణ : విజయవాడ-గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ కోస్తా జిల్లాల్లో నిర్వహిస్తున్న న్యాయవాదుల బంద్ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడలో ఉదయం న్యాయవాదులు విద్యాధరపురం, గవర్నర్‌పేట డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకురాకుండా అడ్డుకున్నారు. అనంతరం నెహ్రు బస్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టి ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వకార్యాలయాలను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయవాదుల బంద్‌తో నగరంలో సిటీబస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నందిగామలో జాతీయరహదారిపై న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైకోర్టు బెంచ్ కోసం తాము నెల రోజులకుపైగా ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల బంద్‌కు పలు పార్టీలు మద్దతు పలికాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి