* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

8, నవంబర్ 2010, సోమవారం

కనికరం లేని ఎంపీలు

Add caption
ప్రరాపా అధినేత చిరంజీవి విమర్శలు
 యలమంచిలి, పాలకొల్లు : వరుస ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోయి అప్పులపాలవుతుంటే మన రాష్ట్ర అధికార పార్టీ ఎంపీలు వారిని ఆదుకునేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకురావటంలో విఫలమవుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రైతులపై మన ఎంపీలకు కనికరం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అమలాపురం, ఇతర ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి అధికార పార్టీ తరఫున అత్యధికంగా ఎంపీలు ఎన్నికైనా వారిద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి చేకూరుతున్న ప్రయోజనాలు శూన్యమని విమర్శించారు. పొరుగున ఉన్న తమిళనాడు ఎంపీలు 200-2009 సంవత్సరాల మధ్య తమిళనాడు ఎంపీలు రోడ్లు తదితర అవసరాల కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి మంజూరుచేయించుకొంటే మన ఎంపీలు రూ.వెయ్యి కోట్లు తేగలిగారని ఎద్దేవా చేశారు. ఈ తేడాను గమనిస్తే మన ఎంపీల పనితీరు సిగ్గుపడేలా ఉందన్నారు. పంజాబ్‌ ఎంపీలు ఆ రాష్ట్రంలో పండిన పూసారకం బియ్యానికి గిట్టుబాటు ధర కల్పించుకోవడంతో పాటు ఆ ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే విధంగా కేంద్రాన్ని ఒప్పించడంలో సఫలీకృతులయ్యారని గుర్తుచేశారు. మన ఎంపీలు తడిచిన ధాన్యాన్ని ఎఫ్‌.సి.ఐ. కొనుగోలు చేయించటం... ఉప్పుడు బియ్యంగా మార్చి ఎగుమతులు చేయడంవంటి విషయాల్లో చొరవ చూపలేకపోతున్నారని విమర్శించారు. గత ఏడాది కృష్ణానది వరదల వల్ల రూ.వేల కోట్లలో నష్టం వాటిల్లిందని.. దీనికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లకు మంజూరు తెస్తే అందులో రూ.550 కోట్లే మన ఎంపీలు తేగలిగారని చెప్పారు. గోదావరి జిల్లాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ఈ కారణంగానే చేలు ముంపుబారిన పడి విపరీతంగా నష్టపోతున్నాయని అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్న ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి కీలకమైన మురుగుకాల్వలు బాగుచేయకలేకపోవటం విచారకరమన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి