బరువెక్కిన అందాల బరువు తగ్గింపుకై నమిత తంటాలు
బొద్దందాల నమిత మొదట్లో చాలా స్లిమ్‌గా అందంగా ఉండేది. కానీ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు అందాలను అపరిమితంగా పెంచేసింది.ఈ బొద్దందాలతోనే తమిళ కుర్రకారును ఆకట్టుకుంటూ సినిమా ఆఫర్లతో నెట్టుకుంటూ వచ్చింది. కానీ ఎంతాకాలం.. అటువంటి సిన్మాల్లో నటించడం అనుకుందో ఏమోగానీ, ఇపుడు హఠాత్తుగా వ్యాయామశాలలో గంటలకొద్దీ తన భారీ అందాలను తగ్గించుకునేందుకు తంటాలు పడుతోందట.అన్నట్లు సెక్సీ శ్రియ నమితకు శరీరం సెక్సీగా ఉండేందుకు మూడు చిట్కాలను చెప్పిందట. అవేంటని ఓ పిల్లజర్నలిస్టు అడిగితే... ఇంకేముంది... యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ అని అందట. నమిత మాత్రం ఈ మూడు అంశాలతోపాటు మరికొన్ని కష్టమైన అంశాలను కూడా చేర్చి రేయింబవళ్లు తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతోందట. ఎంత కష్టం.. ఎంత కష్టం..!!