హైదరాబాద్ : ప్రరాపా అధినేత చిరంజీవి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ఈ సాయంత్రం కలిశారు. గవర్నర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినట్లు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నందుకు గవర్నర్ సంతోషం వెలిబుచ్చారని చెప్పారు. ప్రభుత్వానికి మా అవసరం వస్తే మద్దతిస్తామని, అయితే ఆ అవసరం రాదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందన్న అనుమానం తనకు లేదని, అందుకే ఆ విషయం గవర్నర్ వద్ద ప్రస్తావించలేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు తొలి ప్రధాన్యం ఇవ్వడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గవర్నర్‌ను తాను కలవాలనుకున్నానని, అయితే అదే సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని చిరంజీవి తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి