* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

22, జనవరి 2011, శనివారం

కనుల పండువగా వేల్పుల వీధి గౌరమ్మ మహోత్సవం

అనకాపల్లి,(విశాల విశాఖ):ఉత్తరాంధ్రాలోనే ప్రఖ్యాతిగాంచిన పట్టణంలోని వేల్పులవీధి శ్రీగౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఉత్సవం సందర్భంగా గౌరీ పరమేశ్వరుల ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో సర్వా ంగ సుందరంగా అలంకరించారు. ప్రాతఃకాలం నుంచి ఆలయంలో గౌరీప రమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గౌరీపరమేశ్వరులను దర్శిం చుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ మహోత్సవానికి 156 సంవత్సరాల చరిత్ర ఉంది. వేల్పులవీధిలో వేల్పులరామారావుకు చెందిన స్ధలంలో ఒక రాయికి గౌరీపర మేశ్వరి అని పేరుపెట్టి వేల్పులవారి ఇంట పుట్టిన వేల్పుల గౌరమ్మ అనే బాలిక ఆడుకుంటూఉండేదని పెద్దలు చెబుతుంటారు. ఆమె యుక్త వయసుకు వచ్చి వివాహ మైన తరువాత అత్తవారి ఇంట్లోనూ ఆ ప్రతిమతో గౌర మ్మను ఆరాదించే ది. ఇరుగుపొరుగు వారిని కూడా గౌరమ్మను ఆరాధించాలని కోరేది. కాగా 1935 నుంచి గౌరమ్మను ఆరాధించే భక్తుల సంఖ్య పెరిగింది. ఆనాటి కాలంలో పెద్దలు వాకాడ దాలె ప్ప తదితరులు గౌరీ పరమేశ్వరుల ఉత్స వాన్ని ఘనంగా నిర్వహించేవారు.వేల్పుల గౌరమ్మ మరణానంతరం వేల్పుల కుటుంబీకులు గౌరమ్మ పీఠాన్ని ప్రతిష్టించారు. ఉత్సవం రోజున ఈ పీఠాన్ని వేల్పుల రామారావు కుమా రుడు వేల్పుల గణేష్‌ తలపై ఉంచి ఉరేగింపుగా పొలా ల్లోకి వెళ్లి దానిని వరిదు బ్బుపై ఉంచి మూడు సార్లు ప్రదక్షిన చేసిన తర్వాత దానిని గుడి దగ్గర ఉన్న పీఠంపై ప్రతిష్టించి ఉత్సవాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అంత టి ప్రాధాన్యత కలిగిన ఈ ఉత్స వాన్ని తిలకించేందుకు జిల్లా నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గౌరమ్మను దర్శి ంచు కుంటూ ఉంటారు. జాతరను పురస్కరించుకుని అనకా పల్లి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు, శాసన మండలి ప్రతిపక్షనేత దాడి వీరభ ద్రరావు తదితర ప్రముఖులు శనివా రం ఉదయం ఆలయంలో గౌరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి