విశాఖపట్నం: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 73 మంది పోలీస్ సిబ్బందికి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ శ్యామలరావు రివార్డులందజేయనున్నట్టు కమిషనరేట్ వర్గాలు మంగళవారం తెలిపాయి. నగర ట్రాఫిక్ ఏసీపీ సురేష్‌బాబు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక ఆర్‌ఎస్‌ఐ, ముగ్గురు హోంగార్డులు, మరికొంతమంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అడ్మినిస్ట్రేటివ్ విభాగం సిబ్బందితో పాటు జిల్లాకు చెందిన 30 మంది సిబ్బంది కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాలు అందుకుంటారని అధికారులు తెలిపారు. గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పోలీస్ బ్యారెక్స్ అందంగా ముస్తాబయింది. బుధవారం ఉదయం 9గంటలకు కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావుల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ, అనంతరం ప్రసంగం ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది పరేడ్ నిర్వహిస్తారు. జవాన్ల క వాతు సమర్థంగా నిర్వహించేందుకు మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఏఆర్ సిబ్బంది తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి