అనకాపల్లి: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వట్టివసంత్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో జీవదార సంజీవని పశురక్ష విభాగాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులకు తక్కువ ధరలో మందులు అందించడానికి సంజీవని పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అలాగే పశువుల మందులు తక్కువ ధరలో అందించడానికి పశురక్ష పథకాన్ని ప్రారంభించామన్నారు.ఈ కేంద్రం ద్వారా ప్రముఖ కంపెనీలకు చెందిన పశువుల మందులు 19 నుంచి 57 శాతం తక్కువ ధరలకు అందిస్తామన్నారు. దీంతో పాటుగా సంజీవని పథకం ద్వారా ఇక్కడ 30శాతం తక్కువకు మందులు అందిస్తామన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో రచ్చబండలను నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా సి.ఎం. కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో తిరిగి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. అనంతరం కలక్టర్ శ్యామలరావు మాట్లాడుతూ సంజీవని పథకం ద్వారా జిల్లాలో అయిదు కేంద్రాల్లో రూ. 80లక్షల మందుల అమ్మకాలు చేపట్టామన్నారు. బయట మార్కెట్లో దీని విలువరూ. 3కోట్లకు పైగా ఉంటుందన్నారు. ప్రైవేటు వైద్యులు సంజీవని దుకాణాల్లో మందులు కొనుగోలు చేయించేలా సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీకాంత్ ప్రభాకర్, పశు సంరక్షకశాఖ జేడీ సింహాచలం, ఏడీ రామూర్తినాయుడు, డ్రగ్‌ఇన్పెక్టర్ రజిత, జిల్లా వైద్యవిధాన పరిషత్తు సమన్వయకర్త నాయక్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి, కలక్టర్‌లను అనకాపల్లి మెడికల్ అసోసియేషన్ సభ్యులు వంకాయల ఈశ్వరరావు, కోడూరు త్రినాధ్ తదితరులు సత్కరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి