* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

31, జనవరి 2011, సోమవారం

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

విశాఖపట్నం: ప్రతీ అయిదేళ్లకోసారి జరిగే బీఎస్‌ఎన్‌ఎల్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయి. ఎన్నికల సంఘం, కార్మిక శాఖల ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ దీనిని సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి పోలింగు మొదలవుతుంది. సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్‌ పెట్టెల్ని స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. 3వ తేదీన వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జిల్లా మొత్తం మీద క్లాస్‌-3, 4 సిబ్బంది 1450 మంది ఉండగా వారంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. దేశం మొత్తం మీద ఏ కార్మిక సంఘానికి ఎక్కువ ఓట్లు లభిస్తే ఆ సంఘానికే రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఈసారి బరిలో ఉన్నవాటిలో ప్రధాన పోటీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, టెలికాం ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌.ఎఫ్‌.టి.ఇ.)ల మధ్యే కనిపిస్తోంది. మొత్తం ప్రక్రియ సాధారణ ఎన్నికల మాదిరిగానే ఉంటుంది. ఓటర్ల జాబితా ప్రకటన, ఆ తర్వాత బదిలీలపై నిషేధం, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్‌ పెట్టెల సమీకరణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి... ఇదంతా పక్కాగా నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఎన్నికల పరిశీలకులూ దీని కోసం వస్తున్నారు. దాదాపు సిబ్బంది అంతా 15 రోజులుగా ఈ కోలాహలంలోనే నిమగ్నమై ఉన్నారు.కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై రెండు కార్మిక సంఘాలు వాగ్దానాలను చేశాయి. విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టాయి. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఇంకు సరఫరాసహా మొత్తం సామగ్రి అంతటినీ పోలింగ్‌ కేంద్రాలకు చేర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిబ్బంది ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అనకాపల్లి, అరకు, బాలచెరువు, భీమిలి, సి.ఆర్‌.ఆర్‌. సముదాయం, చోడవరం, డాబాగార్డెన్స్‌, గోపాలపట్నం, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, మల్కాపురం, ఎం.వి.పి.కాలనీ, మింది, నర్సీపట్నం, పాడేరు, వెలంపేట, యలమంచిలి, మధురవాడల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి