* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, జనవరి 2011, మంగళవారం

కాంగ్రెస్‌ హయాంలోనే మహిళల అభివృద్ధి

పొదుపు సంఘాలకు రుణాల పంపిణీలో రోశయ్య
విశాఖపట్నం: కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే మహిళల అభివృద్ధి జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. మన రాష్ట్రంలో మహిళా సాధికారత ఉద్యమంలా సాగుతుందని, ప్రతీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలోనూ వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. మంగళవారం వుడా బాలల థియేటర్‌లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన పొదుపు సంఘాల రుణపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు విద్యలో వెనుకబడి ఉండడం బాధాకరమన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేయాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలన్నారు. మన రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు ఉద్యమంలా సాగుతున్నాయని, బ్యాంకులు కూడా మహిళలకు రుణాలు అందించే విషయంలో సానుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. అన్ని రకాల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నందున ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. అనంతరం 855 స్వయం సహాయక బృంద మహిళలకు బ్యాంకర్లు సమకూర్చిన రూ.14.75 కోట్లను రోశయ్య అందించారు. పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ నిర్వహిస్తున్న శారీరక ధారుడ్య పోటీల కప్‌ను ఇదే వేదికపై ఆవిష్కరించారు. మేయర్‌ పులుసు జనార్ధనరావు, కలెక్టర్‌ జె.శ్యామలరావు, వుడా వీసీ బి.శ్రీధర్‌, జీవీఎంసీ కమిషనర్‌ వి.ఎన్‌.విష్ణు, శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయకుమార్‌, ఎం.శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి