చోడవరం:ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఇరుకున పెట్టి పబ్బం గడుపుకోవడానికి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్ప డుతూ లోక్‌సత్తా నాయకులుగా చలామణీ అవుతున్న ఇద్దరు వ్యక్తులపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ షేక్ గఫూర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరానికి చెందిన భూపతి హర్షవర్థనరావు, విశాఖకు చెందిన శ్రీను అనే ఇద్దరు లోక్‌సత్తాపార్టీ నాయకులుగా చెప్పుకుని మంగళవారం స్థానిక 4ఎస్ కళాశాలలో హడావిడి సృష్టించారు. కళాశాల డైరెక్టర్ పాత్రిన జగన్నాధరావు(జగన్) ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ ఇద్దరు కళాశాలలో ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఆయన కార్యాలయ గదిలోకి ప్రవేశించి, రికార్డులు చూపాలని, లేకుంటే మీ అంతు తేలుస్తామని, నానా దు ర్భాషలాడుతూ గందరగోళం సృష్టించారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు హర్షవర్థన్, శ్రీను ఇద్దరిపైనా కళాశాల యాజమాన్నాన్ని అంతు చూస్తామ ని, సంగతి తేలుస్తామని బెదిరించిన నేరానికి ఐపిసి 506, కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన నేరానికి ఐపిసి 427, యాజమాన్యం అనుమతి లేకుండా కళాశాలలోనికి ప్రవేశించిన నేరానికి ఐపిసి 448, కళాశాల ఆవరణలో దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తించిన నేరానికి ఐపిసి 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. గతంలో స్థానిక ఉషోదయా కళాశాల యాజ మాన్యాన్ని హర్షవర్థన్ ఇదే రీతిలో బెదిరి ంచాడన్నారు. ప్రైవేటు కళాశాలల యాజమా న్యాలను ఈ రీతిలో బెదిరించడం, డబ్బు డిమాండ్ చేయడం, దారి రాకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని హడావి డి చేసి జేబు నింపుకోవడం అలవా టుగా మారిందన్నారు. వైన్‌షాపు యజ మానులను ఇదేరీతిలో బెదిరించినట్టు సమాచారం ఉందని ఎస్‌ఐ తెలిపారు. రోజు రోజుకు హర్షవర్థన్ ఆగడాలు మితిమీరి పోతున్నా యని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిం చేలా పరిణమిస్తుండడంతో కేసును నమోదు చేశామని, తక్షణం వీరిద్దరినీ అరెస్టు చేయనున్నట్టు ఎస్‌ఐ గఫూర్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి