పాడేరు(విశాల విశాఖ) : ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాడేరు మండలంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అధికారుల్ని ఆదేశించారు. గురువారం సాయంత్రం పాడేరు మండలంలో గుత్తులపుట్టు, కిండంగి గ్రామాల్లో పర్యటించిన మంత్రి రచ్చబండ కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేశారు. భారీ బహిరంగ సభ కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ జె.శ్యామలరావుకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ వినీత్ బ్రిజ్‌లాల్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సత్యనారాయణ, ఆర్డీఓ కేఆర్డీ ప్రసాదరావు, జడ్పీటీసీ సభ్యులు ఉషారాణి, సర్పంచి నారాయణ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి