గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరానికి సమీపంలోని చినవుటుపల్లి వద్ద చెన్నై కోల్‌కత్తా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం... విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం విజయవాడ నుండి కారులో వైజాగ్ వెళుతుండగా చిన్నఅవుటుపల్లి సమీపంలో టిప్పర్ ఢీకొంది. లారీ డ్రైవర్ డివైడర్ వద్ద రోడ్‌క్రాస్ చేయబోగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న గంటా శారద (45), పోతినేని కల్పన (35) గాయపడ్డారు. స్థానికులు అప్రమత్తమై వారిని సమీపంలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారుముందు భాగం బాగా దెబ్బతింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ తూర్పునకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పిన్నమనేని ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి