హైదరాబాద్: రాష్ట్రంలో 2014 నాటికి కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదని అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగే పడవని కేంద్ర మంత్రి పదవులు రాని ఆ పార్టీకి చెందిన ఎంపీలే అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయిన పడవని అంబటి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో రాష్ర్టంలో సాధించిపెట్టిన అధికారం ఉండడం వల్లె ఆ పార్టీ ఇంకా ఉన్నట్టు కన్పిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంత బలహీన నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అంబటి అన్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీలే మునిగిపోయే పడవని’ వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని ఎద్దేవా చేశారు.తెలుగు ఎంపీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి దెబ్బతీసిందన్నారు. 2014 నాటికి జగన్ తిరిగి కాంగ్రెస్‌లో కలుస్తారని వస్తున్న ఊహాగానాలను అంబటి కొట్టిపారేశారు. కాంగ్రెస్ నాయకులే జగన్ పార్టీలోకి వస్తారని అన్నారు. చంద్రబాబుకు పోటీగానే జగన్ జనదీక్ష తలపెట్టారన్న వార్తలను ఆయన ఖండించారు. ఎవరితో పోటీపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో నిరంతరం పోరాటం చేయాలన్న తాపత్రయంతో జగన్ ముందుకు కదులుతున్నారని అంబటి వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి