విశాఖ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ఈనెల 24న విశాఖ వస్తున్నారు. ఆ రోజు ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి నగరం చేరుకునే ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా రాజాం వెళతారు. అక్కడ రచ్చబండ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు రాత్రికి విశాఖ చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేస్తారు. 25న పాడేరులో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. కొమ్మాదిలో ఏర్పాటు చేయనున్న మరో కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి