హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నైపుణ్యం లేని కూలీకి రోజుకు వంద రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడా కూలీని రూ. 121కి పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఈనెల 14న ఉపాధి హామీ కూలీలకు ఆయా రాష్ట్రాల కూలీవేతనాల ఆధారంగా మన రాష్ట్రంలో రూ. 121లుగా నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమలుల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల రేటు మనకంటే అధికంగా ఉండడం గమనార్హం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి