అనకాపల్లి: అనకాపల్లికి చెందిన జలగడుగుల గౌతమి సత్యశ్రీ అమెరికాలోని టెంపుల్ వర్సిటీ నుంచి అవార్డు పొందారు. ఈ యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న సత్యశ్రీ వంశపారంపర్యంగా సంక్రమించే ఇన్‌హెరిటెడ్ థ్రాంబో సైటోపినియా ( రక్తం గట్టకట్టడానికి సహాయపడే వ్యవస్థ) లోపంపై జరిపిన పరిశోధనలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.అలాగే అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా(ఏఎస్‌ఐఓఏ) కూడా ఈమె ప్రతిభను గుర్తించి యంగ్ సైంటిస్ట్2010 అవార్డుని ప్రకటించింది. గౌతమి సత్యశ్రీ తండ్రి రిటైర్డ్ తహశీల్దార్ జలగడుగుల చినగురువులు, తల్లి పార్వతీకుమారి. ఏఎంఏఎల్ కళాశాలలో బీఎస్సీ చదివిన ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ,ఎంఫిల్ కోర్సులను పూర్తి చేశారు. సత్యశ్రీకి అవార్డు పట్ల స్థానికులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమె భర్త డాక్టర్ మహదేవ్ కళ్యాణకర్ కూడా శాస్తవ్రేత్తగా పనిచేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి