హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంతో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా విలవిల్లాడుతోంది. దారిద్య్రరేఖ దిగువనున్న నిరుపేద చిన్నారులను పౌష్టికాహార లోపం నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు కొద్దిరోజులుగా గడ్లు సరఫరాను నిలిపివేశారు. గుడ్ల ధర పెరగడమే అందుకు కారణమని తెలిసింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గర్భిణీలకు, 18ఏళ్ల వయస్సులోపు ఎదుగుదల లేని స్ర్తీలకుపౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ్రపభుత్వం ఏటా వందల కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 229 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 91,307 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గతంలో పౌష్టికాహారంగా కిచిడీతోపాటు స్వీటును సరఫరా చేసేవారు.అయితే గుడ్డులో అధికంగా పోషక విలువలు ఉన్నాయని, పౌష్టికాహారంతో పాటు వారానికి రెండు సార్లు గుడ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలకు గుడ్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నది. ప్రాజెక్టు వారీగా గుడ్లు సరఫరా చేసేందుకు కొంతమందికి బాధ్యతలు అప్పగించింది. ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు గర్భిణీలకు వారానికి రెండు సార్లు ‘ఉడకబెట్టిన’ గుడ్డును సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ప్రారంభించి రెండు నెలలు గడవకముందే గుడ్ల ధర ఆకాశానికి చేరడంతో వాటి సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం తెలియని నిరుపేదలు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి గుడ్డు ఇవ్వాలని వర్కర్లతో నిత్యం కొట్లాటకు దిగుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి