* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

26, జనవరి 2011, బుధవారం

సబ్బంపై జగన్‌ సీరియస్‌

కాంగ్రెస్‌ జగన్‌ మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగు తుంటే ఆ విషయం తెలిసిన మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సయోధ్య వాతావరణాన్ని చెడగొడుతున్నారని జగన్‌ వర్గీ యుడిగా ముద్ర పడిన అనకాపల్లి కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై జగన్‌ వర్గం మండిపడుతోంది. సబ్బం హరి తన అపరిపక్వత రాజకీయ చర్యతో చివరకు జగన్‌ పరువు తీశారంటున్నారు. స్వయంగా జగన్‌ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను మంటకలిపేలా ఉన్నాయని తన సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను భ్రష్ఠు పట్టించాలన్న కసితో సొంత పార్టీ పెట్టేందుకు పరుగులు పెడుతున్న జగన్‌ను నైతికంగా దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరిపై జగన్‌ వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాట మార్చడం, మడమ తిప్పడం తన తండ్రి తనకు నేర్పలేదని ఒకవైపు జగన్‌ ఖండితంగా చెబుతున్నారు. ఆయన అను చరుడిగా ముద్రపడిన సబ్బం మాత్రం కాంగ్రెస్‌ - జగన్‌ మధ్య సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమవుతే, సీఎం కిరణ్‌ దానిని చెడగొడుతున్నారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్‌ పరువును మంటగలిపేలా ఉన్నాయని జగన్‌ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సబ్బంవ్యాఖ్యల వల్ల.. జగన్‌ పైకి కాంగ్రెస్‌తో పోరాడుతూనే, దొడ్డిదారిలో తిరిగి అదే పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారన్న భావన కల్పించారని జగన్‌ వ ర్గీయులు మండిపడుతున్నారు. దీనివల్ల ఇప్పటివరకూ ప్రజల్లో జగన్‌పై ఉన్న హీరోవర్షిప్‌ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఒకరకమైన వ్యతిరేకభావన కల్పించారంటున్నారు. మడమ తిప్పని వీరుడిగా, సోనియాగాంధీనే ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన ధీరుడిగా సంపాదించుకున్న ఇమేజ్‌ అంతా సబ్బం హరి వ్యాఖ్యలతో కొట్టుకుపోయి, చివరకు జగన్‌ కూడా పదవులు-ఉనికి చాటుకునేందుకేందుకు ప్రయత్నించే ఒక సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే ముద్రపడటాన్ని ఆయన అనుచరులు సహించలేకపోతున్నారు. అసలు జగన్‌-కాంగ్రెస్‌ మధ్య సయోధ్య జరుగుతోందని సబ్బం హరికి ఎవరు చెప్పారని జగన్‌ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.చివరకు.. జగన్‌ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలపై తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు తాను అన్నింటికీ తెగించి పార్టీ స్థాపించే యత్నాల్లో ఉంటే, తన మద్దతుదారుడయిన సబ్బం హరి మాత్రం అందుకు విరుద్ధంగా తనకు కాంగ్రెస్‌కు మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం వల్ల తన ఇమేజ్‌ దెబ్బతిందని జగన్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. హరి వ్యవహారశైలి ఇప్పటివరకూ తాను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ఠను మంటగలిపాయని మండిపడినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌కు భయపడుతున్నందువల్లే తాను ఆ పార్టీ నాయకత్వంతో సయోధ్య కుదుర్చునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, భావన క్షేత్రస్థాయిలో విస్తృతమవుతే ఇక తాను పార్టీ పెట్టినా ఫలితం ఉండదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రజలు తనను వీరుడిగా కాకుండా పిరికివాడుగా భావించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. ఈ కారణాల వల్లే సబ్బం తీరుపై జగన్‌ కలత చెందుతున్నారు.జగన్‌ అనుచ రులయితే సబ్బం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రణబ్‌-ఆంటోనీ వంటి సీనియర్లతో చర్చలు జరిపేంత స్థాయి సబ్బం హరికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీడియాను ఆకర్షించి, కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం పెంచుకునే ఎత్తుగడ తప్ప సబ్బం హరికి ఢిల్లీలో అంత సీన్‌ లేదంటున్నారు. అసలు సబ్బం.. జగన్‌ పెట్టే పార్టీలో చేరతారా లేదా అన్నది కూడా సందేహమేనంటున్నారు. జగన్‌ విశాఖ ఓదార్పు యాత్రకు ముందు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత, ఆ విధానాలు తనకు నచ్చితేనే పార్టీలో చేరతానని మాట మార్చడాన్ని జగన్‌ వర్గీయులు గుర్తు చేస్తున్నారు.చివరకు అసలు సబ్బం హరి జగన్‌ పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయినా ఆశ్చర్యపడవలసిన పనిలేదని విశాఖ జిల్లా నేతలు జోస్యం చెబుతున్నారు. కాగా, జగన్‌కాంగ్రెస్‌ మధ్య సయోధ్య యత్నాలపై వ్యాఖ్యానించిన సబ్బం హరిపై మంత్రి బాలరాజు విశాఖ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్‌, తైనాల విజయకుమార్‌, విజయప్రసాద్‌ విరుచుకుపడ్డారు. సబ్బం హరి స్థాయి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే స్థాయి హరికి లేదన్నారు. వారి వద్దకు వెళ్లడానికి ఈయన స్థాయేమిటి? జాతీయ స్థాయి నేతగా ఊహించుకుని, ప్రచారం చేసుకుంటున్నాడు.ఒక వేళ వెళ్లినా వారి గుమ్మం కూడా ఎక్కే పరిస్థితి కూడా ఉండదు. నీతి నియమాలు వదిలి అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. రాజీనామా చేసి ఏ ఇతర పార్టీ నుంచయినా పోటీ చేసి గెలవాల’ని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియా, కిరణ్‌, కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే విజయకుమార్‌ మరో అడుగు ముందుకేసి ‘సబ్బం హరి కాంగ్రెస్‌లో కాకుండా మరే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ గుర్తు లేకుండా పోటీ చేసి గెలిస్తే గుండు చేసుకుని ఏడాదిపాటు తిరుగుతానని సవాల్‌ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి