విశాఖపట్నం:భారత ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశామని డీసీఆర్ సన్యాసినాయుడు పేర్కొన్నారు. దీనిపై శనివారం జీవీఎంసీ సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ పరిధిలో 234 డిజిగ్నేటెడ్ కేంద్రాల్లో మొదటిసారిగా ఓటరు నమోదు చేయించుకున్న 18 నుంచి 20 ఏళ్ల వారిలో ఒక్కో కేంద్రం నుంచి కొంతమందిని గుర్తించి అభినందిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పాఠశాలలు, కళాశాలల స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం పోటీలను నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, బిల్లు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి