* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, జనవరి 2011, మంగళవారం

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

జిల్లా సంయుక్త కలెక్టర్‌ భాస్కర్‌
రాంబిల్లి : సెజ్‌ పునరావాస కాలనీలోని నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్‌ పోలా భాస్కర్‌ స్పష్టం చేశారు. సెజ్‌ కాలనీ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం అధికారులు, నిర్వాసితులతో ఆయన సమస్యలపై సమీక్షించారు. నిర్వాసిత గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌.హెచ్‌.జి) మహిళలు ఆహార ఉత్పత్తుల తయారీపై దృష్టి పెడితే దానిపై అవగాహన కల్పిస్తామన్నారు. బార్కు ఆధ్వర్యంలో మినరల్‌ వాటర్‌, బయోగ్యాస్‌, ఇతర ఆహార ఉత్పత్తి తయారీ కేంద్రాల ఏర్పాటును పవర్‌ ప్రెజంటేషన్‌ ద్వారా నిర్వాసితులకు వివరించారు. అనంతరం జేసీ కొందరు మహిళలను వీటిపై అడిగారు. అయితే వారి నుంచి పెద్దగా స్పందన లేదు. వీధి దీపాల నిర్వహణ లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు నిర్వాసితులు జేసీ దృష్టికి తెచ్చారు. దీనపై చర్యలు తీసుకోవాలని ప్రత్యేకధికారి పి.చిరంజీవిని ఆయన ఆదేశించారు. కాలనీలోని పల్లపు ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని చుట్టూ చేరిన నీటితో ఇబ్బందులు పడుతుంటే గృహాలు నిర్మించని వారి స్థలాలు చదును చేస్తున్నారని గురుజాపాలెం మాజీ సర్పంచి లాలం ప్రసాదరావు అనానరు. దీనిపై సంబంధిత ఇంజినీరింగు అధికారులతో మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సెజ్‌ నిర్వాసితులకు ఉన్న అన్ని సమస్యలు కాలానుగునంగా పరిష్కరిస్తామని చెప్పారు. కాలనీలో లబ్ధిపొందిన అనర్హులపై దర్యాప్తు జరిపి చెక్కులు పంపిణీ చేపట్టాలని గురుజాపాలెం గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశాకే చెక్కులు పంపిణీ చేయాలని ప్రత్యేక ఉపకల్టెర్‌, తహసిల్దారులను జేసీ ఆదేశించారు. సెజ్‌ కాలనీ అభివృద్ధి కమిటీ ఏర్పాటుపై అచ్యుతాపురం మండల తెదేపా అధ్యక్షుడు రాజాన రమేషుకుమార్‌, మాజీ సర్పంచి లాలం ప్రసాదు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథ సంచాలకుడు శ్రీకాంత్‌ ప్రభాకర్‌, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.చిరంజీవి, ఎం.బి. కామేశ్వరరావు, ఎన్‌. సీతామహలక్ష్మి, ఎపీఐఐసీ డీజెడ్‌ఎం ఎతిరాజులు, పంచాయతీరాజ్‌ డీఈఈ ఎం.నాగరాజు, గ్రామీణ నీటి సరఫరా డీఈఈ జి.శర్మ, ఈపీడీసీఎల్‌ అధికారులు, అచ్యుతాపురం, రాంబిల్లి తహసిల్దార్లు, కె.ధర్మారావు, మనోరంజని, బార్కు ప్రతినిధులు,నిర్వాసిత గ్రామాల నాయకులు బి. రాందాస్‌, లాలం శ్రీనివాసరావు, కాళ్లరమణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి