* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

24, జనవరి 2011, సోమవారం

అనకాపల్లిలో జిల్లా స్థాయి కళాప్రదర్శన

అనకాపల్లి : నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న అనకాపల్లిలో జిల్లా స్థాయి కళాప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా యువ సమన్వయ అధికారి బి.అప్పారావు తెలిపారు. సోమవారం ఆయన దేవరాపల్లిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో చోడవరంలో నిర్వహిస్తామన్నారు. వీటిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లాలో తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి ఇటీవల కాశ్మీరు, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందాలు వచ్చాయన్నారు. జిల్లాలోని దిబ్బిడికి చెందిన కోలాటాల బృందాన్ని ఒరిస్సా రాష్ట్రానికి పంపించామన్నారు. జిల్లాలో 2,900 యువజన సంఘాలున్నాయన్నారు. వీటిలో 700 సంఘాల పనితీరు బాగుందన్నారు. ముఖ్యంగా దేవరాపల్లి, కె.కోటపాడు, పాయకరావుపేట మండలాల్లో యువజన సంఘాల పనితీరు నిరాశాజనకంగా ఉందన్నారు. ఈ మండలాల్లో వీటిని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో యువజన సంఘాల పనితీరుని మెరుగు పర్చడానికి ప్రతీ ఏటా రూ. 7 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 128 సంఘాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేశామన్నారు. మరికొన్ని సంఘాలకు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. 8 యువజన సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణానికి రూ. లక్షా 60 వేలు మంజూరు చేశామన్నారు. 34 మండలాల్లో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పై అవగాహనా తరగతులు నిర్వహించామని వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామగ్రామాన అవగాహనా శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారన్నారు. 1836, 2001 రాష్ట్రప్రభుత్వ చట్టప్రకారం నెహ్రూ యువ కేంద్రంలో పేరు నమోదు చేయించుకున్న సంఘాలకు మాత్రమే తమ సేవలు అందిస్తామన్నారు. ఈయన వెంట మండల సమన్వయ కర్త కడియాల శ్రీను తదితరులున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి