రాష్ట్ర రాజకీయ రంగంలో ఐరన్ లెగ్ అనే పేరున్న నటి రోజా తనను విమర్శిస్తున్నారని చేనేత మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు ఎద్దేవా చేశారు. తనపై విమర్శలు చేసిన వైయస్ జగన్ వర్గానికి చెందిన సినీనటి, రాజకీయ నాయకురాలు రోజాపై మంత్రి విరుచుకుపడ్డారు.వై.ఎస్. జగన్ ఆస్తులపై రోజా చేసిన వ్యాఖ్యలు కోర్టును ధిక్కరించినట్లవుతుందని శంకర్రావు అన్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అనంతరం శంకర్రావు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. తెలంగాణకు 15 నెలల పాటు రాజ్యాంగ రక్షణలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తుందని, ఆ తర్వాత తెలంగాణ కేంద్రం ప్రకటిస్తుందని శంకర్రావు సంచలన ప్రకటన చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమన్నారు. కాగా.. వై.ఎస్. జగన్మోహన రెడ్డి అక్రమ ఆస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శంకర్రావు స్పష్టం చేశారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి