విశాఖపట్నం: ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విలువ ఇవ్వలేదన్న విషయాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ రోజు ఇక్కడ బయటపెట్టారు. రామకృష్ణా బీచ్'లో యువనేత జగన్మోహన రెడ్డి ప్రారంభించిన జనదీక్ష శిబిరం వద్ద ఆయన ప్రసంగించారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని తాను సోనియా గాంధీకి చెప్పినా ఆమె కనీస పలకరించేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. పాదయాత్ర చేయమని తాను ఆదేశించలేదని, దానిపై తనకు సదభిప్రాయంలేదని ఆమె చెప్పినట్లు తెలిపారు. దాని పర్యవసానం ఏదైనా వైఎస్ఆరే అనుభవించాలని కూడా సోనియా స్పష్టంగా చెప్పారన్నారు. ఇది జరిగింది విశాఖపట్నం విమానాశ్రయంలోనేనని ఆయన తెలిపారు. ఆ సంఘటకు ప్రత్యక్ష సాక్షి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అని కూడా కొణతాల తెలిపారు. ఇటువంటి నాయకులకా మనం మద్దతు పలికేది అని ఆనాడు తనకు అనిపించిందన్నారు. ఆరోజు నుంచి తాను సోనియా గాంధీని కలవలేదని ఆయన చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి