జమ్ము: జమ్ము విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నంనుంచి హైడ్రామా నడిచింది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రిపబ్లిక్ డేరోజు త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు భాజపా నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, అనంతకుమార్‌లు జమ్ము వచ్చారు. వారు విమానాశ్రయంలో దిగగానే పోలీసులు బైటకు వెళ్లే దారిని మూసివేసి వారిని అడ్డుకున్నారు. విమానాశ్రయం బయట పెద్దసంఖ్యలో భాజపా కార్యకర్తలు ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అందుకే సెక్షన్ 144 ప్రకారం వారిని అనుమతి నిరాకరించారని అధికారులు తెలిపారు. వారిని వెనుకకు ఢిల్లీ వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించి లోపలే ధర్నాకు దిగారు. రెండుగంటలపాటు లోపల వారి ధర్నా, బయట కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది. చివరకు అధికారులు భాజపా నేతలను బయటకు వెళ్లేందుకు అనుమతించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి