ఎలమంచిలి(విశాల విశాఖ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రజారాజ్యం పార్టీకి గతంలో కంటే అధిక స్థానాలు లభిస్తాయని ప్రరాపా శాసనసభ ఉపనేత గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం ఎలమంచిలిలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోదని స్పష్టం చేశారు. ఒక వేళ అదే పరిస్థితి వస్తే పార్టీ అధినేత చిరంజీవి నిర్ణయం ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చు ప్రజలపై పడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌పార్టీకి మద్దతు ఇస్తుందన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఒక్క ప్రజారాజ్య ంపార్టీకి ఉందన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రరాపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దుబాసి నాగేంద్రకుమార్, కస్పా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి